పల్లవి
[అతడు] చూడచక్కని జింకపిల్లరా శ్రీరామచంద్రా
హొయ్ చెంగుమంటు చెంతకొచ్చెరా శ్రీరామచంద్రా
[ఆమె] నీ కోసమే నే పుట్టి పెరిగా ఇన్నాళ్లుగా నీకోసం వెతిగా
నీ తోడుంటే ప్రతీరోజూ పండగే నువులేకుంటే బతికేది దండగే
[అతడు] నీ జల్లోని పువ్వయ్యినే ఉంటానే పువ్వుల బుల్లెమ్మా
[ఆమె] కళ్ళునావి చూపులు నీవిరా శ్రీరామచంద్రా
మాటనాది మనసు నీదిరా ఓ రామచంద్రా
చరణం 1
[అతడు] చెంపకుచారెడు కళ్లు చామంతులు పూస్తే వళ్లు నీ నవ్వే మల్లెలు జల్లే చిలకమ్మ
[ఆమె] అన్నీ నీకే ఇస్తా నీ వెంటనే నడిచొస్తా నీ వాకిలి ముందుర ముగ్గయై నేనుంటా
[అతడు] గుండెల నిండా ప్రేముండాలి భామ
దాన్ని ఏం చెయ్యాలో నువ్వే చెబుదువురామా
[ఆమె] నలుగురి ముందు తాళిని కట్టేయ్ మామ ఆ తరువాతేంజేయాలో చెబుతాలేమా
[అతడు] ఊరంతా పచ్చంగా పందిర్లెయ్యనా
[ఆమె] పదుగుర్లో పదిలంగా పెళ్లాడేయ్యనా
[అతడు] నీ మెళ్లోని గొలుసయి నీ గుండెల్లో కాపురమెట్టేయనా ||మాట||
చరణం 2
[ఆమె] గుళ్లో దేవుని కన్నా నువ్వేలే నాకు మిన్న నీ కాలికి అంటిన మన్నే బొట్టంటా
[అతడు] మేడలు మిద్దెలు కన్నా ముద్దొచ్చే పెదవులు మిన్న నీ కమ్మని ముద్దే కట్నం లెమ్మన్నా
[ఆమె] కొంగలు జారే కమ్మని రాతిరిలోనా నువు కోరిన పండు కొరికిస్తాలే మామా
[అతడు] కాటుక మరకలు అంటే కౌగిలిలోనా తెల్లారులు నిన్ను కరిగిస్తాలే భామా
[ఆమె] నీ మాటేనే వింటా ఏనాటికీ
[అతడు] సయ్యంటే సయ్యంటా సయ్యాటకి
[ఆమె] చెంగట్టేసి పట్టేసి చుట్టేస్తా సిగ్గుల చిలకమ్మా