సారేజహాసే అఛ్చా

పల్లవి

ఆ . . .సాపాసా
సారేజహాసే అఛ్చా హిందూ సితాహమారా హమారా ||2||
హమ్‌బుల్‌ బులేమే ఇస్‌కీ తీగుల్‌ సితాహమారా హమారా ||సారే||
నిసస సససస నిసస ||2||
[అతడు] ఘుల్‌ఘుల్‌ అను చిరుగజ్జెల స్వరము
ఇది స్వరమా
[ఆమె] జల్‌జల్‌ అను జతగుండెల వరమా
కలవరమా
[అతడు] నాలో ఏదో
[ఆమె] నాదంమ్రోగే
[అతడు] చిగురాకుల శుభలేఖలు శుభమస్తని పలికెను పద
[ఆమె] సుఖమా
[అతడు] సుఖమా
[ఆమె] సుఖమా ||నిసస||ఘల్‌||

చరణం 1

[అతడు] కవ్వించే కౌగిళ్ళ లోగిళ్ళలో సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[ఆమె] కైపెక్కే నీకళ్ళ వాకిళ్ళలో సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[అతడు] జుమ్మన్నది జివ్వన్నది నరంనరం సుఖస్వరం
[ఆమె] రమ్మన్నది ఇమ్మన్నది రసాల సారం
[అతడు] అనుబంధాల అందాల గంధంపూసి
[ఆమె] చనువియ్యాలి సరసానికి ||ఘల్||

చరణం 2

[ఆమె] చెక్కిళ్ళే చెమరించే సిగ్గావిరి సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[అతడు] చుక్కల్లో నడిపించే రసలాహిరి సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[ఆమె] పింఛాలను విప్పించిన వయ్యారమే మయూరమై
[అతడు] పూచిందిలే సింగారపు పసందులన్నీ
[ఆమె] నయగారాల రాగాల అందాలన్నీ
[అతడు] పూతలవుతుంటవి కావాలియే ||ఘల్‌||