ప్రియా నిను చూడలేక

పల్లవి

[ఆమె] ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక
నీ తలుపుతోనె బ్రతుకుతున్నా . . .
[అతడు] నీ తలపుతోనె ప్రియా . . .

చరణం 1

[అతడు] నీ చేతిగాలులను నేనడిగాను నీకుశలం
[ఆమె] ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం
[అతడు] అనుక్షణం నామనసు తహతహలాడే
[ఆమె] ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
[అతడు] అనుదినం కలలలో నీకధలే
[ఆమె] కనులకు నిదురలే కరువాయె ||ప్రియా||

చరణం 2

[అతడు] కోవెలలో కోరితిని నీదరికి నను చేర్చమని
[ఆమె] దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
[అతడు] లేఖతో ముద్దయినా అందించదా
[ఆమె] నినుగాక నీకలని పెదవంటుకోదా
[అతడు] వలపులు నీదరి చేరుటిలా
[ఆమె] ఊహల పడవలే చేర్చునులే ||ప్రియా||