మనుషులంత దూరమైన మనసులు చేరుర చేసేదే ప్రేమా

పల్లవి

మనుషులంత దూరమైన మనసులు చేరుర చేసేదే ప్రేమా
మనుషులంతా చేరవైనా మనసుల దూరం చేసేది ప్రేమే
ఓ! మనాలి ఓ!మనాలి చేసుకో జాలీ
ప్రేమకోసం బెంగపడితే జీవితం కాళి ||ఓమనాలి||
వద్దందిరా ఏబాధలు వయ్యారి కూన
జల్సాలనే చెయ్యండిరా సిందాడి జాన
వచ్చాడులే ఇన్నాళ్ళకు వాస్కోడిగామా
మెచ్చానులే పెద్దింటిలో తీస్కోరా మావా
ఓ మనాలి - ఓ! మనాలి - లేదులే జాలి ఓ! మనాలి
ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి ఓ! మనాలి

చరణం 1

ఓరోమియే ఓ జూలియట్‌ ఆనాటి స్టోరీ
ఈ రోజున ఆ ట్రాజెడీ ఓరంగసాని
ఆరోమియో ఆ జూలియట్‌ ఈనాడు లేరా...
ఈనాటికి ఆప్రేమను చూపించలేదా
నిన్న తిరిగి రాదంట రేపు మనది కాదంట
ఈరోజే నీదే గురూ...
నిన్న తియ్యని గురుతైతే రేపు కమ్మని కల అయితే
ఈ నాటికిది చాలదా... ||ఓమనాలి||

చరణం 2

లవ్‌ అన్న ఆమటన్నదే లైఫంట నాకూ
ప్రేమింతగా లోతైనదో ఏంతెలుసునీకు
ఎందుకయ్యా ఆవేశం అందదంత ఆకాశం
నిచ్చెనలు నువ్వేసినా
ఆరదువ్వి ఆరాటం ఆగదూ ఈ పోరాటం
మాదేవుడే వచ్చినా... ||ఓమనాలి||