పల్లవి
[ఆమె] చికు చికు బుకు బుకు చికు చికు బుకు బుకు కు కు కూ
[అతడు] గంగోత్రి
చికు బుకు చికు బుకు కూత
[అతడు] & [ఆమె] రైలు బండి రైలుబండిలోనే పాట వుంది పాటలోనే స్వరాలెన్ని
చికు బుకు చికు బుకు - 2
[ఆమె] సరి గమ సరి గమ సరి గమ పదనిస
[అతడు] & [ఆమె] రైలుబండి రైలుబండి నడకలోని నాట్యమండి మట్టిలోని చెట్టులన్ని
[ఆమె] చికు బుకు చికు బుకు - 2
తకదిమి తకదిమి తకదిమి తకజన
[అతడు] & [ఆమె] అలసట లేని సంగీతాన్ని విన్పిస్తుందండి
మనుషుల మధ్య దూరాలన్ని చెరిపేస్తుంది రైలుబండి
చికుబుకు చికు బుకు . . .
[ఆమె] కు కు కూ . . . గంగోత్రి
ఛాయ్ కాఫీ పల్లీ పల్లీల్ బెడీ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్ల్ట్ ఇడ్లీ వడా వేడి వేడి వడ
[అతడు] కేరళలోన కొబ్బరి నీళ్ళు తాగిస్తుందండి
కర్ణాటక పిసి పేలా పాటు తినిపిస్తుందండి
చికు బుకు చికు బుకు . . .
[ఆమె] ఆంధ్రాలోన పెసరట్టు ఉప్మా పార్శిల్ కట్టించి
మహారాష్ట్రాలో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది
చికు బుకు చికు బుకు . . .
[అతడు] & [ఆమె] ఆగ్రా సౌధమ్ చూపించి సిమ్లా యాపిల్ అందించి
హరిద్వారలో అడుగేసి హృషికేశ్లో తెప్పించి
గంగోత్రికే చక చక మంటు పరుగులు తీస్తుంది
[ఆమె] కు కు కూ . . . గంగోత్రి
చరణం 1
ఎండల్లోన మండుతూ వున్న నీడను మనకిచ్చి
వానల్లోన తానే తడిసి గొడుగవుతుందండి చికు బుకు చికు బుకు . . .
[అతడు] రాత్రంతా తను నిద్దరమాని మేల్కొంటుందండి
అమ్మల్లే మనకు ఊయలలూపి జోకొడుతుందండి
చికు బుకు చికు బుకు . . .
[అతడు] & [ఆమె] సెలవులు తనకు వద్దంటు స్నేహితులను మనకందిస్తూ
అందని భారం మోసేస్తూ కోరిన తీరం చేరుస్తూ
మతము, కులమును భేదం తనకు లేదంటుందండి
మానవజాతిని ఒకే త్రాటిపై నిలిపిస్తుందండి
చికు బుకు చికు బుకు ||రైలు బండి||