పల్లవి
[ఆమె] దింతనననా దింతన దింతన . . .
[అతడు] గంగా నీ ఉరుకులేరుగంగా నా గుండెలేమో గంగా
సరిగమలే సాగంగా మధురిమలో మునగంగా
గంగా నిజంగా నువ్వే నాలో సగ భాగంగా
[ఆమె] నీ ఉరుకులే రా గంగా నా గుండెలే మోగంగా
సరిగమలే సాగంగా నాలో సగభాగంగా ||2||
చరణం 1
[అతడు] నువ్విచ్చిన మనసే క్షేమం నువ్వు పంచిన ప్రేమే క్షేమం నువ్వై నేనున్నాను క్షేమంగా
[ఆమె] మనమాడిన ఆటలు సౌఖ్యం మనసాడిన మాటలు సౌఖ్యం
మనువయ్యే కలలున్నాయి సౌఖ్యంగా
[అతడు] నే చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా
ప్రతి వనమున నువ్వు ప్రత్యక్షం గత జన్మలో నువ్వు వెలయని సౌభాగ్యంగా
గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా ||నీ ఉరుకులే||
చరణం 2
[ఆమె] నువ్వు పంపిన జాబుల పూలు నా సిగలో జాజులు
కాగా దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా
[అతడు] నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా
చేరాతలు నా తల రాతను మార్చంగా
[ఆమె] నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనస్సుకు అడ్డంగా
నువ్వు చేసిన నీ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా
[అతడు] గంగా నిజంగా నువ్వే నాలో సగ భాగంగా
[ఆమె] నీ ఉరుకులే