రామచక్కనోడమ్మ చందమామ రాకరాక ఎందుకొచ్చే

పల్లవి

[ఆమె] రామచక్కనోడమ్మ చందమామ రాకరాక ఎందుకొచ్చే అయోరామా
[అతడు] కల్లోకి వచ్చినట్టు మేనమామ కళ్ళముందు కొచ్చినాడు ఎదురుకోవా
[ఆమె] అత్తకొడుకని నిన్ను అల్లుకోనా అత్తిపత్తిలాగ నేను ముడుచుకోనా
[అతడు] అత్తారు పన్నీరు అత్తుకోవే ఆమీదచిట్కెనేలు అందుకోవే ||రామ||

చరణం 1

[ఆమె] కొప్పులో పువ్వులోరేకు లోలకుంటిని చెంపలో ముద్దుల నింపుతానే
[అతడు] చేతుల గాజుల సద్దుచేయకుంటనే ముద్దుకో కౌగిలి ముట్టచెప్తాలే
నిన్నూ నన్నూ చూస్తావుంటే నోరూరుతుందే ఊరోళ్లకు
[ఆమె] వీళతో మంచిగా దిష్టితీసి పెట్టుకుంటా నీకు నేను పైటచాటు
యాదగిరి గుట్టమీద ఒట్టుపెట్టూ ||రామచుక్క||

చరణం 2

[అతడు] మామిడిచెట్టులా ఉంటవమ్మా ఎప్పుడూ అందనే అందరూ పొందటానికి
[ఆమె] పక్కనే చక్కని నిచ్చెనుంది చూసుకో పండిన కొమ్మను వంచటానికి
[అతడు] సింగమోలే నేను వస్తే సిగ్గుపల్లకీలో చోటిస్తవా
[ఆమె] పట్టుతేనెలు ఇచ్చుకోనా ఉట్టిమీద జున్నుపాలు దాయకుండా
[అతడు] వల్లకొచ్చి ముంతనువ్వు దాయకుండా ||రామచుక్క||