అబబ్బా ఇద్దూ అదిరేలా ముద్దూ

పల్లవి

[ఆమె] అబబ్బా ఇద్దూ అదిరేలా ముద్దూ
[అతడు] అమ్మమ్మా ఇద్దూ మధురాల మరుముద్దూ ||అబబ్బా||
[ఆమె] చలిపులి పంజా విసిరితే సలసలకాగె వయసులో
[అతడు] జిలజిలలాడే సొగసుకే జోలాలి ||అబబ్బా||

చరణం 1

[ఆమె] వాటేసుకో వదలకు వలపుల వల విసిరి
వాయించు నీ మురళిని వయసు గాలిపోసి
[అతడు] దోచేయ్యనా దొరికితే దొరకని కోకసిరి
రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి
[ఆమె] ఎవరికి తెలియవు యదరసనసలు
[అతడు] పరువాలాటకు పానుపు పిలిచాక
[ఆమె] తనువు తాకిన తనవి తీరని వేళా ||అబబ్బా||

చరణం 2

[అతడు] జాబిల్లితో జతకలు జగడపు రగడలతో
పొంకాలతో నిలునిలు పొగడవాలే
[ఆమె] ఆకాశమే కొలుకొలు తొడినిడు నడుమిదిగో
సూరీడునే పిలు పిలు చుక్కా చూసి పోకే
[అతడు] అలకల చిలకలు చెలి రుసరుసలూ
[ఆమె] ఇక జాగెందుకు ఇరుకున పడిపోక
[అతడు] మనసు తీరిన వయసుమారనివేళ ||అబబ్బా||