ఆటకావాలా పాటకావాలా

పల్లవి

[అతడు] ఆటకావాలా పాటకావాలా స్వచ్చమైన అచ్చతెలుగు బీటు కావాలా
[ఆమె] ఆటకావాలి పాటకావాలి గాజువాక సెంటర్లో ఫ్లాటు కావాలి
[అతడు] ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
[ఆమె] మానేదెట్టా గురువా అదినా హాబీ
[అతడు] ఊపే ఊల్లే
[ఆమె] చేసేయ్ డ్రిల్లే
[అతడు] భూగోళం అదిరేలా కదం తొక్కాలి
స్వీటుకావాలా హాటుకావాలా నాణ్యమైన నాటుచికెన్‌ లెగ్స్ కావాలా
[ఆమె] స్వీటు కావాలి హాటు కావాలి రాసిస్తే వైజాగ్ స్టీలు ఫ్లాంటు కావాలి

చరణం 1

[అతడు] ఝులుకు ఝులుకు కులుకులతో మెరిసే ఓ పోరీ
నీ తళుకు తళుకు అందాలతో మత్తెక్కించేపోరీ
చూపులతో నా మనసును గుచ్చేసావే నారీ
ఇటు చూస్తే మనసాగునంటే ఆయాం వెరీ సారీ
చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే
పిల్లగాలి గిల్లుతుందీ దిల్‌తే తేదే
[ఆమె] మండపేట కుర్రదాన్ని ఓ బాబయ్య
మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యా
[అతడు] ఓగే రాణీ చేస్తా బోణీ ఆపైన చెప్పొద్దే మరో కహానీ
చిప్స్ కావాలా లిప్స్ కావాలా గరం గరం సింగపూరు పప్సు కావాలా
చిప్స్ కావాలీ లిప్స్ కావాలీ అప్పనంగా ఇస్తే షిప్సు యార్డ్ కావాలీ

చరణం 2

[ఆమె] కింగులాంటి నిన్ను చూస్తే మనసౌతాంది
నీ ఫ్రెస్సుతోటే కావాలంటే సిగ్గేస్తుందీ
[అతడు] పట్టుచీర కొనిపెడితే ముంబాయి బుల్లి
గట్టిపట్టు పట్టనిస్తావా జూకామాలే
[ఆమె] అయితే రడీ పట్టేయ్యి గిలీ కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబాడీ
[అతడు] దిండు కావాలా దుప్పటి కావాలా లైటు లండన్‌ ఫోం బెడ్డుకావాలా
[ఆమె] దిండు కావాలీ దుప్పటి కావాలీ రెచ్చిపోతే మినపసున్ని ఉండ కావాలీ
[అతడు] ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
[ఆమె] మీనేదెట్టా గురువా అదినా హాబీ
[అతడు] ఊపే ఊళ్ళే
[ఆమె] చేసేయ్ దిళ్ళే
[అతడు] భూగోళం అదిరేలా కదం తొక్కాలే
స్వీటు కావాలా హాటు కావాలా నాణ్యమైన నాటు చికెన్‌ లెగ్స్ కావాలా
[ఆమె] స్వీటు కావాలి హాటు కావాలి మస్తుమస్తు మెగాస్టార్ ముద్దు కావాలి