పల్లవి
హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆదినుంచి లోకంలో ఆడవారిది పై చేయి
చరణం 1
నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరపాటు ||2||
నాటికీ నేటికీ మీకు అలవాటే
హలో హలో ఓ అమ్మాయి అవును మీదే పై చేయి
చరణం 2
బెట్టుచేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి ||2||
మనసులూ మమతలూ పైకి వేషాలూ
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
చరణం 3
లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి ||2||
గెలుపు కోసం మగవారు ||2||
కాళ్ళ బేరము లాడకపోరు
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్‌బై
హలో హలో ఓ అమ్మాయి
విభాగములు:
- ఇ.వి.సరోజ,
- ఎ.యన్.ఆర్,
* ఘంటసాల,
* పి.సుశీల,
# యుగళ గీతాలు,
+ ఇద్దరు మిత్రులు,
$ య - ఱ