పల్లవి
ఏలే . . . ఏలే . . . మరదలా వాలే . . . వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సోకులు
ఇచ్చేయ్ పచ్చారు సొగసులు చాలు నీతోటి సరసాలు బావా ఏలే . . . లే . . .
చరణం 1
గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటలు తేటల మరదలు
పేటరి చూపుల విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా
చీటికి మాటికి చెనకేవు - నట్టి బూటకాలు మానిపోవే బావా ఏలే . . . ఏలే . . .
చరణం 2
కన్నుల గంటపు కవితలు గిలికేవు నాయెద చాటున మరదలా
పాడని పాటల పయిటలు సరిదేవు పల్లవి పదముల దరువులో
కంటికి వంటికి కలిపేవు - ఎన్ని కొంటె లీలలంట కొలో బావా
పాడుకోపాట జంట పాడుకున్న పాట జాజిపూదోట