పల్లవి
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్ ||2||
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవ్వరికో
తేల్చుకో ముందుగా ఛలోరే - - -
చంపనిదే బతకవని బతికేందుకు చంపమని నమ్మించే
అడివిని అడిగేం లాభం బతికే దారెటని ఛలోరే ...
సంహరం సహజమని సహవాసం స్వప్నమని తర్కించే
తెలివికి తెలిసేనా తానే తన శత్రువని చలోరే ...
ధీరులకి, దీనులకి అమ్మ ఒడి ఒక్కటే వీరులకి, చోరులకి కంట
తడి ఒక్కటే చలోరే ...
అప్పుడెపుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునికం యుగ
యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం చలోరే ...
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం చలోరే ...
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవి కిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం చలోరే ...