యమునాతీరం సంధ్యారాగం

పల్లవి

యమునాతీరం సంధ్యారాగం
నిజమయినాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో

చరణం 1

ప్రాప్తమనుకో ఈ క్షణమె బ్రతుకులాగా
పండెననుకో ఈ బ్రతుకే మనసుతీరా
శిధిలంగా విధినైనా చేసేదే ప్రేమ
హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ
మరువకుమా ఆనంద ఆనందమానందమానందమాయేటి మనసు కధ

చరణం 2

ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలిమంటై రగిలేదే ప్రేమ
చిగురించే ఋతువుల్లే విరబూసే ప్రేమ
మరువకుమా ఆనంద ఆనందమానందమానందమాయేటి మధుర కధ