పల్లవి
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వశి కైనా ఇంతందం సాధ్యమా
కనులారా నిన్ను చూస్తే తెలిసిందేబ్రహ్మ కష్టం
ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్నసత్యం
నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమ ఏమొ ఏమిటొ నన్నే మార్చినది ||అమ్మో అమ్మాయేనా||
చరణం 1
నిషాకళ్ళతోటి వలేవేయకమ్మా అరే చిక్కుకోదా ఎదే చేపగా
వయ్యారాల వైపు అలా చూడకయ్యా సిరేకందిపోదా మరీ ఎర్రగా
నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్మిదవుతా
నువ్వే కాలిమువ్వ అయితే నేను రాగమవుతా
నిన్నే దాచుకుంటాలే ప్రియా గుండె కోవెల్లోన
బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి
ప్రాణం పోసుకు వచ్చిన పాటవు నీవు సఖీ ||అమ్మో అమ్మయేనా||
చరణం 2
ప్రియా నిన్ను చూసి మదే మారిపోయే
అదేం మాయెగాని వానవిల్లుగా
చెలీ నిన్ను చేరి ఎడారైన గానీ "వసంతాలు" జల్లే పూలవెల్లువ
నువ్వే సిద్ధరవుతే నేను జోలపాటనవుతా
నువ్వే దగ్గరయితే హాయి లోన తేలిపోతా
చెలీ నువ్వు అవునంటే సరాగాల సంభరమవుతా
నువ్వు నేను ఏకమై ఇపుడే మనమవుదాం
నింగినేల సాక్షిగా ఎపుడూ ఒకటవుదాం ||అమ్మో అమ్మయేనా||
కలలోన నిన్నుచూసి మనసార కోరకున్న
ఇలలోన ఇంతలోన ఎదురైతే చేరుకున్న ||నాలో||