పల్లవి
ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైనా కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
చరణం 1
కట్టుకధలా ఈ మమతే కలవరింత
కాలమొకటే కలలకైనా పులకరింత
శిలకూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధిమార్చే కధ ప్రేమాయణం
మరువకుమా వేసంగి ఎండల్లో
పూసేటి మల్లెల్లో మనసుకధ
చరణం 2
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులు ఎగసిన ఊసులు
మూగే మనసులు అవి మూగవై
తడి తడి వయ్యారాలెన్నో ప్రియా ప్రియా అన్నవేళ