పల్లవి
గుత్తి వంకాయ కూరోయ్ బావా
కోరి వండినానోయ్ బావా
||గుత్తి||
చరణం 1
కూర లోపల నా వలపంతా
కూరిపెట్టి నానోయ్ బావా
కోరికతో తినవోయ్ బావా
||గుత్తి||
చరణం 2
తీయని పాయసమోయ్ బావా
తీరుగ వండానోయ్ బావా
పాయసములో ప్రేమనియేటి
పాలు పోసినానోయ్ బావా
బాగని మెచ్చాలోయ్ బావా
||గుత్తి||
చరణం 3
కమ్మని పూరీలోయ్ బావా
కరకర వేచానోయ్ బావా
కరకర వేచిన పూరీల తన
కాంక్ష వేసినానోయ్ బావా
కనికరించి తినవోయ్ బావా
||గుత్తి||
చరణం 4
వెన్నెల ఇదిగోనోయ్ బావా
కన్నుల కింపౌనోయ్ బావా
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న కలిపినానోయ్ బావా
వేగముగ రావోయ్ బావా
||గుత్తి||
చరణం 5
పూవుల సజ్జదిగో
మల్లెపూవుల పరచిందోయ్ బావా
పూవులతో నాయవ్వనమంతా
పొదిపి పెట్టినానోయ్ బావా
పదవోయ్ పవళింతాం బావా