పల్లవి
ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో
చిక్కుకున్న పిల్లవాడా||2||
చరణం 1
కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు
మనసు మనసు తెలిసినాక మారలేవు||2||
మరినా మనిషిగా బతకలేవు
||ఎక్కడికి||
చరణం 2
నన్నిడిచి నువ్వెళితే నీ వెంట నేనుంటా
నిన్నిడిచి నే వెళితే నువ్వు బతకలేవంట
ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా||2||
ప్రేమంటే అంతేరా పిచ్చివాడా
ఎక్కడికి పోతావు చిన్నదానా
నా చుపుల్లో చిక్కుకున్న పిల్లదానా
చరణం 3
పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆటకాదు||2||
ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు
పువ్వైనా నవ్వైనా నీ కోసం పూయదు
ఎక్కడికైనా పోవోయ్ చిన్నవాడా
నీ చూపులను ఓపలేను పిల్లవాడా
ఎక్కడికి పోలేను చిన్నదానా
నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా