అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే
ఆంధ్రులమన తమిళులమైనా
ఉత్కళులైనా కన్నడులైనా
మరాఠి అయినా గుజరాత్ అయినా
పంజాబ్ అయినా బంగ్లా అయినా
||అంతా||
వందనమండీ వందనం (తెలుగు)
వణక్కమమ్మా వణక్కం (తలిళం)
నమస్కార్ నమస్కార్ (హిందీ)
ఇస్సలాం ఇస్సలాం (అస్సామీ)
భాషలు వేర్వేరైనా గానీ
భావాలన్నీ ఒక్కటేనోయి
జాతులు మతములు
నీతులు అన్నీ ఒకటేనోయి
దేశాలన్నీ ఒకటే అయితే ద్వేషాలేవీ ఉండవుగా
బాలప్రపంచం భావి ప్రపంచం
భావి భారత వారసులం
||అంతా||