పల్లవి
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద||2||
చరణం 1
సంతానమే లేక స్వర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు||2||
సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి శ్రీమతే రామానుజాయ నమ||శివ గోవింద||
చరణం 2
తమ బాగు కోసమై తంటాలు పడలేనివారు
ఎదుటి కొంపకు ఎసరుపెడతారయా
పొరుగు పచ్చను ఓర్వలేనివారి గతి
శ్రీమతే రామానుజాయ నమ + వెలుగునీడలు,
||శివ గోవింద||
చరణం 3
ఒరుల కోసం త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
ఉపకారికే కీడు తలపెట్టువారి గతి
శ్రీమద్రమారమణ గోవింద
||శివ గోవింద||
చరణం 4
కలిమి లేనన్నాళ్ళు కలిసిమెలిసుంటారు
కలిమి చేరిననాడు కొట్లాడుకుంటారు
కలిమి పెంచే కాయకష్టజీవుల పని
శ్రీమతే రామానుజాయ నమ
||శివ గోవింద||
చరణం 5
ఆ నాడు శ్రీయోగి వీరబ్రహ్మంగారు
కాలజ్ఞానం బోధ చేశారయా
ఈ నాడు ఈ వెంగళప్ప మాట
అక్షరాలా జరిగి తీరేనయా
||శివ గోవింద||