శ్రీలు పొంగిన జీవ గడ్డై...

శ్రీలు పొంగిన జీవ గడ్డై..
పాలు పారిన భాగ్య సీమై.. ||శ్రీలు||
రాలినది ఈ భరత ఖండము..
భక్తి పాడర తమ్ముడా.. ||రాలినది|| ||శ్రీలు||

చరణం

దేశగర్వము కీర్తి చెందగ..
దేశచరితము తేజరిల్లగ....
దేశం మరచిన ధీర పురుషుల..
తెలిసి పాడర తమ్ముడా.. ||దేశం|| ||శ్రీలు|| ||2||

మనసేమో చెప్పినమాటే వినదు...

మనసేమో చెప్పినమాటే వినదు అది ఏమో ఇవాళా
పెదవుల్లో దాచినవసలే అనదు నిను చూస్తూ ఈ జాడ
ఏ మాయ చేశావో ఏ మత్తు జల్లావో
ఆ కలలు కోరికలు వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పూ ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో

అధరం మధురం నయనం మధురం
వచనం మధురం చలనం మధురం
స్రీ మధురాధిపతికి సర్వం మధురం

నేను సైతం నేను సైతం నేను సైతం...

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది
దుఃఖ్ఖానికి తలవంచితె తెలివి కింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకొను మేలైన
ఆ మాత్రం ఆత్మీయత కైనా పనికిరాన
ఎవ్వరితో ఈ మాత్రం పంచుకొన వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటంది

చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది ||3||
గుండెల్లో సుడి తిరిగే కలత కధలు
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది ||2||

కోకిలల కుటుంబంలొ చెడ బుట్టిన కాకిని అని
ఐన వాళ్ళు వెలివెస్తే ఐనా నే ఏకాకిని ||కోకిలల||
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది ||2||

పాత పాట మారాలని చెప్పటమే నా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచె వన్నెల విరి తోట ||వసంతాల||
బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి అడుగు జాడల్లో లేదా ఏ ముళ్ళ బాట ||2||
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది ||3||

ఏటి పొదుగున వసంతమొకటేనా కాలం
ఏది మరి మిగతా కాలాలకు తలం
నిట్టూర్పుల వడగళ్ళుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
ముంచు వంచెనకు మోడై గోడు పెట్టు వాడొకడు
నీలి గొంతులోని చేత వెనుక వున్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ తాళం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగినట్టె కోకిల
కళ్ళు వున్న కబోధిలా చెవులున్నా బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది ||3||

అసహాయతలో దడ దడ లాడే హృదయ మృదంగ ధ్వానం
నదుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
యెదరి బతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బీటలు
దిక్కు మొక్కు తెలియని దీనుల యదార్థ జీవన స్వరాలు
నిలువున నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచేయ్యాలి
జన గీతిని వద్దనుకుంటూ నాకు నేనె హద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను

నేను సైతం విశ్వ వీణకు తంతినై మూర్చనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోస్తాను
నేను సైతం ప్రపంచాజ్ఞకు తెల్ల రేఖై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపాను ||2||
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించు దాకా
ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికసించు దాకా
పాత పాటలు పాడలేను కొత్త బాటను వీడి పోను ||2||
నేను సైతం నేను సైతం నేను సైతం... ||2||

లలిత ప్రియ కమలం విరిసినది...

లలిత ప్రియ కమలం విరిసినది ||2|| కన్నుల కొలనిది ఆ....
ఉదయ రవీకిరణం మెరిసినది ఊహల జగతిని ||2||
అమృత కలశముగా ప్రతినిమిషం ||2||
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది ||లలిత||

చరణం 1

రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం ||2||
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరితల గళమృదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను ||లలిత||

చరణం 2

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినది ||2||
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన బిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరుగిడి
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ... ||లలిత||

పలికే గోరింకా.. చూడవె నా వంకా...

పలికే గోరింకా.. చూడవె నా వంకా ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి నా దీపావళి పండగా ||నేడే||
రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితె రోజా నేడే పూయునే

చరణం 1

పగలే ఇక వెన్నెలా... ఆ.. పగలే ఇక వెన్నెలా వస్తే.. పాపమా
రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ ||2||
కొంచం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు
కలలే.. ఏ.. దరిచేరవా..

చరణం 2

నా పేరే పాటగా... ఆ.. నా పేరే పాటగా కోయిలే.. పాడనీ
నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం మదిలో తం తోం ధిం ||2||
చిరుగాలి కొంచెం వచ్చి నా మోమంతా నిమరనీ
రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకు
బ్రతుకే.. ఏ.. బతికేందుకు..

దోబూచులాటేలరా.. గోపాల మనసంత నీవేనురా...

దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా ||2||
ఆ ఏటి గట్టునేనడిగా చిరు గాలి నాపి నే నడిగా ||2||
ఆకాశాన్నడిగా బదులే లేదు ||2||
చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా ||2|| ||దోబూచులాటేలరా||

చరణం 1

నా మది నీకొక ఆటాడు బొమ్మయ.. ||2||
నాకిక ఆశలు వేరేవి లేవయ ఎద లోలో దాగదయా
నీ అధరాలు అందించ రా.. గోపాల ||2||
నీ కౌగిలిలో కరిగించరా నీ తనువే ఇక నా వెల్లువా
పాలకడలి నాడి నా గానం నీ వన్నె మారలేదేమి ||2||
నా యెదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా... ||దోబూచులాటేలరా||

చరణం 2

గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు.. ||2||
నయనాలు వర్షించ నన్నెట్లు బ్రోచేవు
పూవునకనే నీ మతమా నేనొక్క స్త్రీ నే కదా గోపాల
అది తిలకించ కన్నులే లేవా నీ కలలే నే కాదా
అనుక్షణము ఉలికే నా మనసు అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ కాపాడరా ||దోబూచులాటేలరా||

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలేలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా...

చరణం

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులు
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా...

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది
నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకే నీకే చెప్పాలి అంటున్నది

చరణం 1

నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం
నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం
గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే
వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే

చరణం 2

పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం
అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం
దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే
పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే

ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ

ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద
మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద
పంతం మానుకో భయం దేనికో

చరణం 1

వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక
నిద్దర్లో కూడ వంటరిగా వదలవుగా
నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనక
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా

చరణం 2

ఆమాయకంగ చూడకలా వేడుకలా చిలిపి కల
అయోమయంగ వెయ్యకలా హాయి వల
నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలు జడ
దానొంక చూస్తే ఎందుకట గుండె ధడ
మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా
తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే

ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని

ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని
చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి

చరణం 1

చందమామ మనకందదని ముందుగానె అది తెలుసుకుని
చేయిజాచి పిలవద్దు అని చంటిపాపలకు చెబుతామా
లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకు చెబుతామా
కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా

చరణం 2

అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కద అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా

చరణం 1

నీ లాలిని పాడే లాలన నేనోయ్
జాబిలికై ఆశ పడే బాలను నేను
తల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్
చెల్లిగా చేపట్టి చనువే పంచాలోయ్
సరిగా నాకే ఇంకా తేలని ఈవేళ

చరణం 2

నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నా
క్షణానికో రూపంలో కనబడుతున్నా
జాడవై నావెంట నిను నడిపించాలోయ్
జానకై జన్మంతా జంటగా నడవాలోయ్
తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల

ఎపుడూ నీకు నే తెలుపనిది

ఎపుడూ నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితా౦త౦
వెతికే తీరమే రాన౦ది
బతికే దారినే మూసి౦ది
రగిలే నిన్నలేనా నాకు సొ౦త౦
సమయ౦ చేదుగా నవ్వి౦ది
హృదయ౦ బాధగా చూసి౦ది
నిజమే నీడగా మారి౦ది

చరణం 1

గు౦డెలో ఆశనే తెలుపనే లేదు నా మౌన౦
చూపులో భాషనీ చదవనే లేదు నీ స్నేహ౦
తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదురైనా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్క సారైనా
నేస్తమా నీ పరిచయ౦
కల కరిగి౦చేటి కన్నీటి వానే కాదా

చరణం 2

జ్ఞాపక౦ సాక్షిగా పలకరి౦చావు ప్రతిచోటా
జీవిత౦ నీవని గురుతు చేసావు ప్రతిపూటా
ఒ౦టిగా బతకలేన౦టూ వె౦ట తరిమావు ఇన్నాళ్ళూ
మెలకువే రాని కల క౦టూ గడపమన్నావు నూరేళ్ళూ
ప్రియతమా నీ పరిమళ౦ ఒక ఊహేగాని ఊపిరిగా సొ౦త౦ కాదా

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే.. మరిచి.. బ్రతకాలే మనసా...

చరణం 1

ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం
తపన పడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
మిగిలే.. స్మృతులే.. వరమనుకో మనసా... ||ఓ మనసా||

చరణం 2

తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్నీ కోరదుగా
కడలిలోనె ఆగుతుందా కదలనంటూ ఏ పయనం
వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం
కరిగే.. కలలే.. తరిమే ఓ మనసా... ||ఓ మనసా||

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది

చరణం 1

ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసౌతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది ||ఏ కులము||

చరణం 2

ఆదినుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు ||ఏ కులము||

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ.. మురళి మోహన మురళి ఇదేనా ఆ.. మురళి

చరణం 1

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ.. మురళి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ.. మురళి

చరణం 2

వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ.. మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ.. మురళి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ.. మురళి ||రేపల్లియ||

కనులు తెరచినా కనులు మూసినా కలలు ఆగవేలా

కనులు తెరచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూసా సరిగా
ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా ||కనులు||

చరణం 1

పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోంది
ఐతేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదనీ ఈ లోకం అనుకుంటుంది
కానీ ఆ దూరమె నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ ఙాపకాలె నా ఊపిరైనవని ||కనులు||

చరణం 2

ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టూ నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రసవీయమంది

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో

అతడు: ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిశేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనే ఎక్కడి నుంచో చైత్రం కదిలొస్తుంది
పొగ మంచుని పోపొమ్మంటూ తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది
తన రూపం తానే చూసి పులకిస్తుంది
ఋతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో... ||ఎవరైనా||

ఆమె: ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా నడి రాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ
గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడి దాకా
చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా అక్షరమూ అర్థం కానీ ఈ విధి రాతా
కన్నులకే కనపడనీ ఈ మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ ||ఎవరైనా||

ప్యార్ కర్నా సీఖోనా పారిపోతే పరువేనా

ప్యార్ కర్నా సీఖోనా పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే.. కాదంటానా
యా ఖుదా జర దేఖోనా దూకుతున్నది పైపైన
దిక్కు తోచక ఛస్తున్నా ఏం జోరే జాణ
పుట్టుకొచ్చే పిచ్చి నువ్వు నచ్చి
పట్టుకొచ్చా మెచ్చి పంచుకోవే లవ్ రుచి
పట్టపగలే వచ్చి బరితెగించి
పచ్చి వగలే తెచ్చి వెంట రాకె కొంటెగా కవ్వించి ||ప్యార్ కర్నా||

చరణం 1

ఒంటరి ఈడు కదా తుంటరి తొందర ఉండదా
ఎందుకు ఈ పరదా తగునా
అందుకు ఆడ జత తప్పక అవసరమే కదా
నువ్వది కాదు కదా అవునా
ఇంతలేసి కళ్ళు మొత్తం కట్టి వేసుకు కూర్చున్నావా
నన్ను చూస్తే కొంచెమైనా గుండె తడబడకుంటుందా
బాప్ రే బాప్ తెగ బెదిరానే నమ్మవేం చెబుతున్నా
గాభరా పడుతున్నానే చాలదా పులి కూనా ||ప్యార్ కర్నా||

చరణం 2

దక్కిన చుక్కనిలా తక్కువ చేయకు ఇంతలా
మక్కువ దాచకలా మదిలో కమ్ముకు రాకే ఇలా
తిమ్మిరి పెంచకె వింతగా గమ్మున ఉండవెలా తెరలో
ఆశపడితే దాగుతుందా రాచకార్యం ఇన్నాళ్ళుంటే
మూతపెడితే దాగుతుందా చాలు రాదది జోకొడితే
క్యా కరే నాకేం దారి నౌకరీ పోతుంటే
పోకిరి వైఖరి చాలే ఛోకిరి వదిలెయ్‌వే ||ప్యార్ కర్నా|| ||పుట్టుకొచ్చే||

కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

$కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ ||కరిగేలోగా||

చరణం 1

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగ మారిందా
నేడీ బంధానికి పేరుందా ఇట్టే విడదీసే వీలుందా ||కరిగేలోగా||

చరణం 2

అడిగినవన్ని కాదని పంచిస్తూనే మరునిమిషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే నువు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటను చూస్తుంటే నా బాధంటటి అందంగా ఉందే
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే మరుజన్మే ఓ క్షణమైనా చాలంటే ||కరిగేలోగా||

ఎంతవరకూ.. ఎందుకొరకు.. ఇంత పరుగూ అని అడక్కూ..

ఎంతవరకూ.. ఎందుకొరకు.. ఇంత పరుగూ అని అడక్కూ..
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకూ..
ప్రశ్నలోనే బదులు వుందే గుర్తు పట్టే గుండె నడుగూ..
ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా..
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా.. ||ఎంతవరకూ||

చరణం 1

కనపడే ఎన్నెన్ని కెరటాలూ.. కలగలిపి సముద్రం అంటారు..
అడగరే ఒకొక్క అల పేరూ ఊ ఊ..
మనకిలా ఎదురైన ప్రతివారు.. మనిషనే సంద్రాన కెరటాలు..
పలకరే మనిషి అంటె ఎవరూ ఊ ఊ..
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా వున్నది..
చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది..
నీ వూపిరిలో లేదా.. గాలి వెలుతురు
నీ చూపుల్లో లేదా.. మన్ను మిన్ను
నీరు అన్నీ కలిపితె నువ్వే కాదా.. కాదా.. ||ప్రపంచం||

చరణం 2

మనసులో నీవైన భావాలే.. బయట కనిపిస్తాయి దృశ్యాలే..
నీడలూ నిజాల సాక్ష్యాలే.. ఈ.. ఈ..
శత్రువులు నీలోని లోపాలే.. స్నేహితులు నీకున్న ఇష్టాలే..
ఋతువులు నీ భావ చిత్రాలే.. ఈ.. ఈ
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం..
మోసం రోషం ద్వేషం నీ మకిలీ మదికీ భాష్యం..
పుటక చావూ రెండే రెండు.. నీకవి సొంతం కావు.. పోనీ..
జీవితకాలం నీదే నేస్తం.. రంగులు ఏం వేస్తావో కానీ..
తారరరరె తారరరరె తరరరరె తారరరె.. తారరరరె తారరరరె తరరెరా తారరరె.. తారరరరె తారరరరె తరరెరా తారరరరె

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం
కలత పడుతుందే లో లో న కసురుకుంటోందే నాపైన
తన గుబులు నేను నా దిగిలు తాను
కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం
ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం
పచ్చగా ఉన్న పూతోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా ||పచ్చగా||
ఉండలేను నెమ్మదిగా ఎందుకంటే తెలియదుగా ||2||
తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకు పోడం తక్షణం
అంటూ పట్టుపడుతుందీ ఆరాటం పదమంటూ నెట్టుకెలుతుందీ నను సైతం

చేరి యశోదకు శిశువితడు

చేరి యశోదకు శిశువితడు ||2||
ధారుని బ్రహ్మకు తండ్రియు నితడూ
చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియు నితడూ
సొలసి చూచినను సూర్య చంద్రులను నళినగ చల్లెడు లక్ష్మణుడు ||సొలసి||
నిలిచిన నిలువున నిఖిల దేవతల ||3||
కలిగించు సురల ఘనివో ఈతడు ||2|| ||చేరి||

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్ల లన్నవే ఎరుగని వేగం తో వెళ్ళు

చరణం 1

లయకే నిలయమై నీపాదం సాగాలి
మలయానిల గతిలో సుమ బాలగ తూగాలి
వలలో వొదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేది
తిరిగే కాలానికీ ఆ...
తిరిగే కాలానికీ తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటా జూటి లోకి చేరకుంటె
విరుచుకుపడు సురగంగకు విలువేముంది
విలువేముందీ..

చరణం 2

దూకే అలలకూ ఏ తాళం వేస్తారు
ఆహహ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ఆ...
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముంది
విలువేముందీ...

అందెల రవమిది పదములదా.. ఆ...

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
ఓం నమో నమో నమశివాయ
మంగళ ప్రదాయ గోపురంగతే నమశ్శివాయ
గంగ యాతరంగితోత్త మాంగినే నమశ్శివాయ
ఓం నమో నమో నమశ్శివాయ
శూలినే నమో నమః కపాలినే నమశ్శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమశ్శివాయ
అందెల రవమిది పదములదా.. ఆ...
అందెల రవమిది పదములదా.. అంబరమంటిన హృదయముదా.. ||2||
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా
ఆంగిక సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా ||2||
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై ||2||
మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయువేగమై
అంగ భంగిమలు గంగ పొంగులై
హావ భావములు నింగి రంగులై లాస్యం సాగే లీల..
రసఝరులు జాలువారేలా
జంగమమై జడ పాడగా
జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
నయన తేజమే నకారమై
మనో నిశ్చయం మకారమై
శ్వాస చలనమే శికారమై
వాంఛితార్ధమే వకారమై
యోచన సకలము యకారమై
నాదం నకారం మంత్రం మకారం
స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం
ఓం నమశ్శివాయ
భావమె మౌనపు భావ్యము కాదా
భరతమె నిరతము భాగ్యము కాదా
పూరిల గిరులు తరిగేలా తాండవ మాడే వేళా
ప్రాణ పంచమమె పంచాక్షరిగా పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకుణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భతి రేగా ||అందెల||

శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా సిరిసిరి మువ్వా

శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా సిరిసిరి మువ్వా
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా సిరిసిరి మువ్వా
యతి రాజుకు జతి స్వరముల పరిమళ మివ్వా సిరిసిరి మువ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా సిరిసిరి మువ్వా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించిరావా ||పరుగాపక||

చరణం 1

పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరీ... ||పడమర||
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ...
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ ||2||
నిదురించిన హృదయరవళి ఓంకారం కాని... ||శివపూజకు||

చరణం 2

తనవిల్లే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవదీపిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా ||పరుగాపక||

చరణం 3

చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో...
వికసిత సతదల శోభిత సువర్ణకమలం...