ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలేలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా...

చరణం

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులు
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా...