అందెల రవమిది పదములదా.. ఆ...

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
ఓం నమో నమో నమశివాయ
మంగళ ప్రదాయ గోపురంగతే నమశ్శివాయ
గంగ యాతరంగితోత్త మాంగినే నమశ్శివాయ
ఓం నమో నమో నమశ్శివాయ
శూలినే నమో నమః కపాలినే నమశ్శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమశ్శివాయ
అందెల రవమిది పదములదా.. ఆ...
అందెల రవమిది పదములదా.. అంబరమంటిన హృదయముదా.. ||2||
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా
ఆంగిక సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా ||2||
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై ||2||
మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయువేగమై
అంగ భంగిమలు గంగ పొంగులై
హావ భావములు నింగి రంగులై లాస్యం సాగే లీల..
రసఝరులు జాలువారేలా
జంగమమై జడ పాడగా
జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
నయన తేజమే నకారమై
మనో నిశ్చయం మకారమై
శ్వాస చలనమే శికారమై
వాంఛితార్ధమే వకారమై
యోచన సకలము యకారమై
నాదం నకారం మంత్రం మకారం
స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం
ఓం నమశ్శివాయ
భావమె మౌనపు భావ్యము కాదా
భరతమె నిరతము భాగ్యము కాదా
పూరిల గిరులు తరిగేలా తాండవ మాడే వేళా
ప్రాణ పంచమమె పంచాక్షరిగా పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకుణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భతి రేగా ||అందెల||