నేను సైతం నేను సైతం నేను సైతం...

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది
దుఃఖ్ఖానికి తలవంచితె తెలివి కింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకొను మేలైన
ఆ మాత్రం ఆత్మీయత కైనా పనికిరాన
ఎవ్వరితో ఈ మాత్రం పంచుకొన వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటంది

చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది ||3||
గుండెల్లో సుడి తిరిగే కలత కధలు
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది ||2||

కోకిలల కుటుంబంలొ చెడ బుట్టిన కాకిని అని
ఐన వాళ్ళు వెలివెస్తే ఐనా నే ఏకాకిని ||కోకిలల||
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది ||2||

పాత పాట మారాలని చెప్పటమే నా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచె వన్నెల విరి తోట ||వసంతాల||
బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి అడుగు జాడల్లో లేదా ఏ ముళ్ళ బాట ||2||
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది ||3||

ఏటి పొదుగున వసంతమొకటేనా కాలం
ఏది మరి మిగతా కాలాలకు తలం
నిట్టూర్పుల వడగళ్ళుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
ముంచు వంచెనకు మోడై గోడు పెట్టు వాడొకడు
నీలి గొంతులోని చేత వెనుక వున్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ తాళం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగినట్టె కోకిల
కళ్ళు వున్న కబోధిలా చెవులున్నా బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది ||3||

అసహాయతలో దడ దడ లాడే హృదయ మృదంగ ధ్వానం
నదుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
యెదరి బతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బీటలు
దిక్కు మొక్కు తెలియని దీనుల యదార్థ జీవన స్వరాలు
నిలువున నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచేయ్యాలి
జన గీతిని వద్దనుకుంటూ నాకు నేనె హద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను

నేను సైతం విశ్వ వీణకు తంతినై మూర్చనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోస్తాను
నేను సైతం ప్రపంచాజ్ఞకు తెల్ల రేఖై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపాను ||2||
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించు దాకా
ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికసించు దాకా
పాత పాటలు పాడలేను కొత్త బాటను వీడి పోను ||2||
నేను సైతం నేను సైతం నేను సైతం... ||2||