దోబూచులాటేలరా.. గోపాల మనసంత నీవేనురా...

దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా ||2||
ఆ ఏటి గట్టునేనడిగా చిరు గాలి నాపి నే నడిగా ||2||
ఆకాశాన్నడిగా బదులే లేదు ||2||
చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా ||2|| ||దోబూచులాటేలరా||

చరణం 1

నా మది నీకొక ఆటాడు బొమ్మయ.. ||2||
నాకిక ఆశలు వేరేవి లేవయ ఎద లోలో దాగదయా
నీ అధరాలు అందించ రా.. గోపాల ||2||
నీ కౌగిలిలో కరిగించరా నీ తనువే ఇక నా వెల్లువా
పాలకడలి నాడి నా గానం నీ వన్నె మారలేదేమి ||2||
నా యెదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా... ||దోబూచులాటేలరా||

చరణం 2

గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు.. ||2||
నయనాలు వర్షించ నన్నెట్లు బ్రోచేవు
పూవునకనే నీ మతమా నేనొక్క స్త్రీ నే కదా గోపాల
అది తిలకించ కన్నులే లేవా నీ కలలే నే కాదా
అనుక్షణము ఉలికే నా మనసు అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ కాపాడరా ||దోబూచులాటేలరా||