తరలిరాద తనే వసంతం...

తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం...
గగనాలదాక అల సాగకుంటే,
మేఘాల రాగం ఇల చేరుకోదా ||తరలిరాద||

చరణం 1

వెన్నెల దీపం కొందరిదా..
అడవిని సైతం వెలుగు కదా ||వెన్నెల్ల||
ఎల్లలు లేని చల్లన్ని గాలి..
అందరి కోసం బంధువు కాగా...
ప్రతీ మదిని లేపే ప్రభాతరాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం..
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం...
ఇది తెలియని మనుగడ కధ
దిశలెరుగని గమనము కద....

చరణం 2

బ్రతుకున లేని శృతి కలదా..
ఎద సడిలోనే లయ లేదా ||బ్రతుకున||
ఏ కల కైనా.. ఏ కళ కైనా..
జీవిత రంగం వేదిక కాదా..
ప్రజాధనం కాని కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం..
కూసే కోయిల పోతే కాలం ఆగిందా...
మారే ఏరై పారే మరో పదం రాదా..
మురళికి గల స్వరమను కళ
పెదవిని విడి పలకదు కద... ||తరలిరాద||