ఆకుచాటు పిందె తడిసె...

ఆకుచాటు పిందె తడిసె... కోకమాటు పిల్ల తడిసె...
ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది
గూడుచాటు గువ్వ తడుసె...
గుండెమాటు గుట్టుతడిసె... ||2|| ||ఆకాశ ||

చరణం 1

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
ఓ చినుకు నినుతాకి తడియారిపోతుంటే
ఓ చినుకు నీ మెడలో నగలాగ నవ్వుతుంటే
నీ మాటవిని మబ్బుమెరిసి... ఆహా...
జడివానలే కురుసి కుదిపి ఒళ్ళు తడిసి వెల్లివిరిసి
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహా అహా అహా... అహ అహ అహా... ||ఆకుచాటు||

చరణం 2

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే ఆహా...
నీ విరుపులే ముడుపులిచ్చి చలిని పెంచి చెలిమి పంచి
కలలు వెచ్చంగ తడి ఆర్చుకోవాలి
అహ అహ అహా... అహ అహ అహ... ||ఆకుచాటు||