ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ...
అయినదేమో అయినదీ
ప్రియ గానమేదే ప్రేయసి ||2||
ఆ... ప్రేమగానము సాగగానే
భూమి స్వర్గమె అయినది ||2|| ||అయిన||
చరణం 1
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో ||2||
నిన్నుచూసిన నిముషమందే
మనసు నీ వశమైనది.. ||మనసు|| ||అయిన||
చరణం 2
కులుకులొలికే హొయలు చూసి
వలపు చిలికే లయలు చూసి ||2||
తలపులేవో రేగి నాలో
చాల కలవరమైనది.. ||2|| ||అయిన||