కనుపాప కరవైన కనులెందుకో...

కనుపాప కరవైన కనులెందుకో
తనవారె పరులైన బ్రతుకెందుకో ||కనుపాప||

చరణం 1

విరజాజి శిలపైన రాలేందుకే
మరుమల్లె కెంధూళి కలిసేందుకే ||విరజాజి||
మనపైన చినదాని మనసిందుకే
రగిలేందుకే ||కనుపాప||

చరణం 2

అలనాటి మురిపాలు కలలాయెనా
చిననాటి కలలన్ని కధలాయెనా ||అలనాటి||
తలపోసి తలపోసి కుమిలేందుకా
కనువిందుకా ||కనుపాప||

చరణం 3

తన వారు తనవారె విడిపోరులే
కనుమూసి గగనాన కలిసేరులే ||తనవారు||
ఏనాటికైనాను మనపాట మిగిలేనులే
కలకాలమీ గాధ రగిలేనులే ||2||
రగిలేనులే ||కనుపాప||