చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు ||చుక్కల్లో||
చరణం 1
తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది
బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది
పాడె ఎత్తడానికే స్నేహమన్నది
కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది ||చుక్కల్లో||
చరణం 2
పోయినోడు ఇకరాడు ఎవడికేవడు తోడు
ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది
కన్నీళ్ళకు కట్టె కూడ ఆరనన్నది
చావు బతుకులన్నవి ఆడుకుంటవి
చావు లేని స్నేహమే తోడు ఉంటది ||చుక్కల్లో||