హాయ్ హాయ్ హాయ్... ఓ...
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ...
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ...
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓ... ఓ... ఓ ఓ ఓ... ఓ... ||ప్రియ||
చరణం 1
అల్లరి కోయిల పాడిన పల్లవి
స్వరాలలో నీవుంటే.. పదాలలో నేనుంటా..
వేకువ పూచిన కవితల గీతిక
ప్రియా ప్రియా నీవైతే.. శ్రుతి లయ నేనౌతా..
కలకాలం కౌగిలై నినే చేరుకోనీ..
కనురెప్పల నీడలో కలై ఒదిగిపోనీ..
ఓ ప్రియా... ఓ...
దరిచేరితే దాచుకోనా తొలిప్రేమలే దోచుకోనా... ||ప్రియ||
చరణం 2
సవ్వడి చేయని యవ్వనవీణలు
అలా అలా సవరించు.. పదే పదే పలికించు..
వయసులు కోరిన వెన్నెల మధువులు
సఖి చెలి అందించు.. సుఖాలలో తేలించు..
పెదవులతో కమ్మనీ కధే రాసుకోనా..
ఒడిచేరి వెచ్చగా చలేకాచుకోనా..
ఓ ప్రియా... ఓ...
పరువాలనే పంచుకోనీ పడుచాటలే సాగిపోనీ... ||ప్రియ||