జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా ||2||
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా ||జోరు||
చరణం 1
ముస్తాబు అయ్యావు తుమ్మెదా
కస్తూరి రాశావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా
మల్లెపందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా
ఆ మాలెవరికోసమే తుమ్మెదా ||జోరు||
చరణం 2
మెత్తన్ని పరుపూలు తుమ్మెదా
గుత్తంగ కట్టావు తుమ్మెదా
ఒత్తైన పరుపుపై తుమ్మెదా
అత్తర్లు చల్లావు తుమ్మెదా
పక్క వేసుంచావు తుమ్మెదా
ఆ పక్కెవరికోసమే తుమ్మెదా ||జోరు||