రానేలా వసంతాలే

రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేలా వసంతాలే...

చరణం 1

ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నే రాగమే
ఎగిరే పోతమై విరిసే తోటనై
ఏ పాట పాడినా పది పువులై
అవి నేల రాలిన చిరుతావినై
బదులైనలేని ఆశలారబోసి
రానేలా వసంతాలే...

చరణం 2

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపుతోనె చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎదమీటిపోయే ప్రెమగీతిలాగ ||రానేలా||