ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు ||ఏదో||
చరణం 1
ఒదిగి ఒదిగి కూచింది బిడియ పడే ఒయ్యారం
ముడుచుకొనే కొలది మరీ మిడిసి పడే సింగారం
సోయగాల విందులకై
వేయి కనులు కావాలి ఉ ఉ... ||ఏదో||
చరణం 2
నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతో
పూల పాన్పు వేశారు ఉ ఉ... ||ఏదో||