ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో ||ఈ వేళలో||

చరణం 1

నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము... ||2||
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము... ||2||
ఏ వైపు చూస్తున్నా నీ రూపె తోచింది
నువు కాక వేరేదీ కనిపించనంటుంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది

చరణం 2

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది ||2||
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుతుంటావు
||ఈ వేళలో|| ||2||