ప్రేమయే జనన మరణ లీల

ప్రేమయే జనన మరణ లీల
మృత్యుపాశమే అమరబంధమౌ ||2||
యువప్రాణుల మ్రోల... ఆ...
యువప్రాణుల మ్రోల... ||ప్రేమయే||

చరణం 1

ఆకాశమె చెరువయై తోచె
అలలె పొంగి హాయిగ వీచె ||ఆకాశమె||
జీవితమంతా ఒకే పాటుగా
ఎప్పటికీ మనమే ||ప్రేమయే||

చరణం 2

మధుర మధురతరమైన వాంఛలే
హృదయ సదనమును పరిపాలించె ||మధుర||
సుకృత జన్మము మాదే సఫలం సుఖమే ఈ వేళ ||ప్రేమయే||

చరణం 3

తను సాంగత్యము త్రుటియే కాదా ||2||
నిలచు దృఢముగా మానసగాధ ||2||
మృత్యుపాశమే అమరబంధమౌ ||2||
యువప్రాణుల మ్రోల... ||ప్రేమయే||