దేవుడే వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
ఆ... నిద్దరలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే ||దేవుడు||
ఓ...
కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే... ||దేవుడు||
చరణం 1
మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నా... ||మనసు||
నిను మేఘాన ఒక బొమ్మ గావించగా
నే మలిచాను హరివిల్లునే కుంచెగా
ఈ చిరుగాలితో చెప్పనా
నీ మదినిండ నేనుండగా... ||దేవుడు||
చరణం 2
ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా
ఆ... ||ఏడడు||
నా కలలన్ని నీ కనులు చూడాలని
బతిమాలాను నీ కంటిలో పాపని
మన్నించేసి నా మనసునీ
ప్రసాదించు నీ ప్రేమనీ ||దేవుడు||