ధరిణికి గిరి భారమా

ధరిణికి గిరి భారమా
గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా
కని పెంచే తల్లికి పిల్ల భారమా ||ధరణి||

చరణం 1

మనసునే నోచిన నా నోముపండగా
నా ఒడిలో వెలిగే నా చిన్ని నాయనా
పూయని తీవెననే అపవాదు రానీక ||2||
తల్లిననే దీవెనతో తనియించినావయ్య ||తరువు|| ||ధరణి||

చరణం 2

ఆపద వేళల అమ్మమనసు చెదురునా
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్త్రీ విధి ||2||
ప్రేయముగా పాపలను పెంచనిదొక తల్లియా ||తరువు|| ||ధరణి||