లా లా... లలలాలలాల లలలా...
లా లా లా... లలలాలలాలలా...
ఊహుహూ... ఆహాహా... ఓహోహో...
లాలాలా... ఆహహా... ఓహోహో...
రాళ్ళలో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి
కలలోన తీయగా గురుతు తెచ్చుకో ||రాళ్ళల్లో||
చరణం 1
కలలన్నీ పంటలై పండెనేమో
కలిగింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగబంధమేమో
తొలకరి వలపులలో పులకించు
హృదయాలలో ||2||
ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళతాళాలు మన పెళ్ళి మంత్రాలై
వినిపించు వేళలో...
ఎన్నెన్ని భావాలో ||రాళ్ళల్లో||
చరణం 2
చూశాను ఎన్నడో పరికిణీలో వచ్చాయి
కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచెను వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో ||2||
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో
కనిపించు గోములో...
ఎన్నెన్ని కౌగిళ్ళో ||రాళ్ళల్లో||