ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ ||2||
అర్ధం కాని పుస్తకమే అయినా గానీ ఈ ప్రేమ
జీవిత పరమార్ధం తానే అనిపిస్తుందీ ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ ||2||
ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుందీ ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనబడుతుందీ ఈ ప్రేమ
కలసిన వెంటనె ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ ||ప్రేమ||