ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు...

ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు ||ఏటిలోని||

చరణం 1

ఊరు విడిచి వాడ విడచి
ఎంతదూరమేగినా ||2||
సొంత ఊరు అయినవారు
అంతరాన ఉందురోయ్‌ ||2|| ||ఏటిలోని||

చరణం 2

పెంచుకున్న కొలది పెరుగు
తీయని అనుబంధము ||2||
గాయపడిన హృదయాలను
జ్ఞాపకాలే అతుకునోయ్‌ ||2|| ||ఏటిలోని||

చరణం 3

కనుల నీరు చిందితే
మనసు తేలికౌనులే ||2||
తనకు తన వారికి
ఎడబాటే లేదులే ||2|| ||ఏటిలోని||