పూచే పూలలోనా వీచే గాలిలోనా

ఓహొహో... ఏ... హే... ఎహే...
పూచే పూలలోనా వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే... ||2||
ఓ చెలీ... ఓ చెలీ...

చరణం 1

నా ఊహల్లో నీవు ఉయ్యాలలూగేవు ||2||
నా ఊపిరై నీవు నాలోన సాగేవు
నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే ||2||
నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే... ||పూచే||

చరణం 2

ఎన్నో జన్మల బంధము మనది
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిది
నీవు నా గానమే నీవు నా ధ్యానమే ||2||
నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే... ||పూచే||