తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది ||తెలుసునా||
చరణం 1
అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది
పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకో
ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక ||తెలుసునా||
చరణం 2
గుండె లోతుల్లో ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతని తలపే నిండిపోయింది
నిన్నదాక ఎప్పుడూ నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని ||తెలుసునా||
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా