ఇందువదన కుందరదన
మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే ||2||
తొలివలపే తెలిపె చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగె వగల మెగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జోహారిక ||2|| ||ఇందువదన||
చరణం 1
కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో
పకపక నవ్వులలో
పండిన వెన్నెలవై నన్నందుకో
కసికసి చూపులతో
కొసకొస మెరుపులతో నన్నల్లుకో
ముకుళించే పెదవుల్లో మురిపాలు
ఋతువుల్లో మధువంతా సగపాలు
సాహోరే భామా హోయ్ ||ఇందువదన||
చరణం 2
మీసంలో మిసమిసలు మోసాలే చేస్తుంటే
బిగిసిన కౌగిలిలో సొగసరి మీగడలే దోచేసుకో
రుసరుస వయసుతో
ఎడదల దరువులతో ముద్దాడుకో
తొలిపొద్దు ఎండల్లో సరసాలు
పగపట్టే పరువంలో
ప్రణయాలు జోహారే ప్రేమ హోయ్ ||ఇందువదన||