వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే ||2||
వగలరాణివి నీవే...
చరణం 1
పిండి వెన్నెల నీకోసం పిల్లతెమ్మెర నాకోసం ||2||
రెండు కలసిన నిండుపున్నమి రేయి మనకోసం
వగలరాణివి నీవే...
చరణం 2
దోరవయసు చినదాన కోరచూపుల నెరజాణ ||2||
బెదురుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన
వగలరాణివి నీవే...
చరణం 3
కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే ||2||
వరుని కౌగిట ఒరిగినంతట కరగిపోదువులే ||వగలరాణివి||
వగలరణివి నీవే...
వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
విభాగములు:
# యుగళ గీతాలు,
$ య - ఱ,
* ఘంటసాల,
+ బందిపోటు,
- కృష్ణకుమారి,
- యన్.టి.ఆర్