శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ||2||
ఈ నా కృతి నీవు భారతి ||2|| ||శ్రుతి||
ధ్రుతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ||2||
శరణాగతి నీవు భారతి
చరణం 1
నీ పదములొత్తిన పదము ఈ పదము
నిత్య కైవల్య పధము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు
నిగమార్ధ నిధులున్న నెలవు
కోరినా మిగిలిన కోరికేమి నిను కొనియాడు
కృతుల పెన్నిధి తప
చేరినా యిక చేరువున్నదేమి నీ శ్రీచరణ
దివ్యసన్నిధి తప్ప ||శ్రుతి||
చరణం 2
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు
నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు
కీర్తనలు నీ కీర్తులే ||2||
త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత
రాగాలు నీముర్తులే
నీ కరుణ నెలకొన్న ప్రతి రచన జననీ
భవతారక మంత్రాక్షరం ||శ్రుతి||