[అతడు] హే... కృష్ణా... ముకుందా... మురారి
[ఆమె] శ్రీ కృష్ణ శ్రీ కేశవ శ్రీ మాధవ శ్రీ ధరా
దామోదర నీ దర్శనము ఈ జన్మకు దొరకదా
[అతడు] హే మాధవ పుండరీక హే వనమాలి
గోవింద భక్త హృదయ బృందా విహారి
ఆ గజేంద్ర ప్రాణదాత నీవే కదా శ్రీహరి
కొన ఊపిరి ఊపిరిలై కనిపించగా రావా హరి
హే మాధవ పుండరీక హే వనమాలి ఆ...
చరణం 1
[అతడు] అను దిన జన ధూప దీప సంరంభంలో గోవిందా భక్తహృదయ బృందావిహారి
దీనజనుల కన్నీళ్ళు కనపడవా మాధవా ||గోవిందా||
ఘణ ఘణ ఘణ ఘణ గుడి గంటారావంలో నిను నమ్మిన గుండె
గోష వినపడదా కేశవా వినపడదా కేశవా... ||2||
విన్నా వినపడనట్టు ఉంటావా రాయిలా
వింటే మనసుంటే కనులుంటే కనుగొంటే కరుణుంటే రా ఇలా
[ఆమె] శ్రీ ||కృష్ణ||
[అతడు] ||హే మాధవ||
చరణం 2
[అతడు] యశోద వకుళగ వేచియున్నది వేంకటేశునిగా వెళ్ళావే
గోవిందా గోవిందా వెంకటరమణ గోవింద
నరకాసుర చెర వనితల కొరకై సమరార్జటి కావించావే
గోపాలా గోపాలా గోకుల నందన గోపాల
నీకై జనించి నీకై జపించి నీకై తపించి
నీకై జ్వలించే దాసురాలకే దర్శనమివ్వగా
దర్బవోలె నిర్భందించే ఈ గర్భగుడా నీ కడ్డంకి
నీలి మేఘమే నిప్పురాల్చగా నెమలి పింఛమే జడిపిస్తే
ఆ... ప్రభంజనం ప్రజ్వలించదా నీ కాలి ధూళి ఆజ్ఞాపిస్తే
ఆ... తలుపులు తెరిపించు దర్శనమిప్పించు
హే... కృష్ణా... ముకుందా... మురారి