గోపాలబాలకృష్ణ గోకులాష్టమి ఆబాలగోపాల పుణ్యాల పున్నమి
ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని,
నంద నందనుడు నడచిన చోటే నవనందనవని
గోపికాప్రియం కృష్ణహరే నమోకోమల హృదయ కృష్ణహరే
వేవేల రూపాల వేదహరే నమో వేదాంతి విద్య కృష్ణహరే. . . ||2||
[ఆమె] ఆ. . . గోవిందుడె కోక చుట్టి, గోపెమ్మ వేషం కట్టి, మంగోలచేతబట్టి
వచ్చెనమ్మా, నవ మోమన జీవన వరమిచ్చెనమ్మా . . . ||2||
ఇకపై ఇంకెపుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలో చెయ్యేసి ఒట్టేసెనమ్మా
దేవకి వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నిద్ర కృష్ణహరే
యజకుల నందన కృష్ణహరే నమో యశోద నందన కృష్ణహరే . . . ||2||
చరణం 1
[ఆమె] ఎన్నాళ్ళకు, ఎన్నాళ్ళకు, ఎన్నాళ్ళకు, ఎన్నాళ్ళకు వెన్నుడొచ్చెనమ్మా
ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చెనమ్మ
వెన్నపాలు ఆరగించి విన్నపాలు మన్నించి. . . ||2||
కష్టాల కడలి పసిడి పడకాయెనమ్మ కళ్యాణరాగ మురళి కలలు చిలికెనమ్మ
[ఆమె] మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మ
[అతడు] వసుదైక కుటుంబమని గీత చెప్పెనమ్మ
గోవర్ధనోద్దార కృష్ణహరే నమో గోపాల భూపాల కృష్ణహరే
గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణహరే. . . ||2|| ||గోవిందుడె కోక||
చరణం 2
[ఆమె] తప్పటడుగు తాండవాలు చేసినాడమ్మా
తన అడుగులు ముగ్గులు చూసి మురిసినాడమ్మా
[అతడు] మన అడుగున అడుగేసి, మనతోనే చిందేసి. . . ||2||
మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా
కంసారి సంసారిని కలిపి మెరిసెనమ్మా
కలకాల భాగ్యాలు కలిసి వచ్చెనమ్మ
హరిపాదం లేని చోటు మరుభూయేనమ్మా
[ఆమె] శ్రీ పాదం ఉన్న చోట సిరులు విరియునమ్మ
ఆపద్దోద్ధారక కృష్ణహరే నమో ఆనంద వర్ధక కృష్ణహరే
లీలా మానుష కృష్ణహరే నమో తాండవినాశ కృష్ణహరే. . . ||2||
గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణహరే
గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణహరే. . . ||2||