మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా ||2||
విధివరమే నీవేగా నీవేగా...
కలనిజమై పూచేగా పూచేగా...
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా ||2||
జువ్వా... జువ్వా... ||మళ్ళి||
చరణం 1
సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే
స్మృతి పదమున నీ గానమే ||2||
పొంగిపారె ఏటిలో తొంగి తొంగి చూస్తే
తోచెను ప్రియ నీ రూపమే
సోకేటి పవనం నువు మురిపించే గగనం
కోనేటి కమలం లోలో నీ అరళం
కలత నిదురలో కలలాగ జారిపోకె జవరాల
నీలి సంద్రమున అలలాగ హృదయ లోగిలిలో
నువ్వా... నువ్వా... నువ్వా... ||మళ్ళి||
చరణం 2
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
కృంగెను ఎద నీ కోసమే ||2||
సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులా
తగిలెను నీ మృదు పాదమె
ఎగసేటి కెరటం చేరేలే తీరం
చీకటిలో పయనం నువ్వేలే అరుణం
వలపు వరదలో నదిలాగ తడిసిపో జడివానలా
మంచుతెరలలో తడిలాగ నయన చిత్తడిలో
నువ్వా... నువ్వా... నువ్వా... ||మళ్ళి||