ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని ||ఎవరైనా||
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజు నేనై కోటి గుండెల కోటల్ని ||ఎవరైనా||
చరణం 1
రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పోంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్నో
కురిపిస్తాయంటే అంటే
అది నిజమోకాదో తేలాలంటే
చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా ||ఎవరైనా||
చరణం 2
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కధ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడ తలవంచేలా
మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా ||ఎవరైనా||