సాగర సంగమమే..
ప్రణయ సాగర సంగమమే ||2||
కలలే అలలై ఎగిసిన కడలికి ||2||
కలలో... ఇలలో...
కలలో ఇలలో దొరకని కలయిక ||సాగర||
చరణం 1
కన్యాకుమారి నీ పదములు నేనే ఆ...
కన్యాకుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమ సుకుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళా...
అలిగిన నా కొల అలకలూ నీలో
పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళా... ||సాగర||
చరణం 2
భారత భారతి పద సన్నిధిలో...
కులమత సాగర సంగమ శ్రుతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగ వెలిగిన వేళా...
పరువపు ఉరవడి పరువిడి నీ బడి
కన్నుల నీరిడి కలిసిన మనుసున
సందెలు కుంకుమ చిందిన వేళా... ||సాగర||